సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటా ఆనందం : ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
ప్రజాశక్తి - బి.కొత్తకోట : ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుతో ప్రతిఇంట ఆనందం వెల్లివిరుస్తోందని తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని పిటీఎం మండలం సంపత్తికోట సచివాలయ పరిధిలో గల కనుగుమాకులపల్లి, ముంత గోవులపల్లి, సంపతి కోట గ్రామాల్లో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎమ్మెల్యేకు అడుగడుగునా హారతులిస్తూ కార్యకర్తలు,మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి అందుతున్నాయని, ప్రత్యేకంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎనలేని సేవలు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా కుల, మతాలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం ఏపీ సీఎం జగన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి తమ మద్దతు తెలిపాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గిరిధర్,ఎంపీపీ మహమ్మద్, జడ్పిటిసి శివన్న, ఎంపీటీసీ కిట్టన్న, మాజీ ఎంపీటీసీ రమణ, వైఎస్సార్సీపి అన్నమయ్య జిల్లా ప్రచార కార్యదర్శి అయూబ్ బాషా, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామప్రజలు పాల్గొన్నారు.










