May 08,2023 16:19

ప్రజాశక్తి - బి.కొత్తకోట : ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో బాధితుడికి ఆర్థిక సాయం అందజేసినట్లు వైకాపా జిల్లా ప్రచార కార్యదర్శి ఆయూబ్ బాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లి నియోజకవర్గం, బి.కొత్తకోట మండలం, నాయనిబావి గ్రామపంచాయతీ, పట్రవారి పల్లికి చెందిన గుర్రప్పగారి శివశంకర్ ఇటీవల మృతి చెందాడు. దీంతో తమ కుటుంబ పోషణ భారంగా మారిందని మృతుడి భార్య స్థానిక వైకాపా నాయకులకు తెలియజేసింది. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ వెంకట మిథున్ రెడ్డి,తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఈ విషయంపై సత్వరమే స్పందించిన వారు ఆ కుటుంబానికి రూ.50 వేలు అందజేయాలని ఆదేశించారు. దీంతో స్థానిక ఎంపీటీసీ రామసుబ్బారెడ్డి, ఆకులవారి పల్లి గడ్డం మురళి రెడ్డి,ఆకుల వారి పల్లి నరసింహారెడ్డి, నాయన బావి భూషణ్ రెడ్డిల చేతుల మీదుగా పట్రవారి పల్లెలోని మృతుని భార్య జి.లలిత, కుమారుడు అరవింద్, కుమార్తె హర్షితలకు అందజేయడం జరిగింది. తన పరిస్థితిని అర్థం చేసుకొని ఆర్థిక సాయం చేసిన మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి, స్థానిక వైకాపా నాయకులకు మృతుని భార్య, పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు.