Mar 06,2023 20:04

ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడినా నేడు ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఫర్వాలేదనిపించింది. బ్రబోర్న్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌ లో ఆర్సీబీ.. 20 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులో రిచా ఘోష్‌ (28) టాప్‌ స్కోరర్‌. ఆమెతో పాటు మంధాన(23), కనికా అహుజా(22), స్కాట్‌(14), , కనికా 22 , ఎల్లీస్‌ పెర్రీ 13, డివైన్‌(6),దిశా కసత్‌(0), నైట్‌(0), రేణుకా సింగ్‌ 2 పరుగులు మాత్రమే చేశారు. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. అమీలియా కేర్‌, ఇషాక్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

  • పవర్‌ ప్లే పూర్తి.. ఆర్సీబీ 43/4

పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. మందన 23, సోఫీ డివైన్‌ (16), హీథర్‌ నైట్‌ 11, దిశా కసత్‌ (0) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం క్రీజులో రిచా ఘోష్‌, ఎల్లీస్‌ పెర్రీ క్రీజులో ఉన్నారు.

  • టాస్‌ నెగ్గిన ఆర్సీబీ

ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) లో నేడు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ తలపడనున్నాయి. ముంబయిలోని బ్రాబోర్న్‌ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక. ఈ పోరులో టాస్‌ గెలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.