Sep 04,2022 15:21
  • ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి 
  • ఉత్సాహంగా ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం మహాసభ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పోరాటాలకు కార్మికులు సిద్దం కావాలని ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.స్వరూపరాణి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎన్ పి అర్ భవనంలో ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా మహాసభ ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 10,11తేదీల్లో రాష్ట్ర మహాసభలు అనకాపల్లిలో జరగనున్నాయి అన్నారు. దేశంలో 1995నుంచి రాష్ట్రంలో 2003 నుంచి పథకం అమలులోకి వచ్చిందన్నారు. 2007 వరకు వేతనాలు లేవు,యూనియన్ ఏర్పాటు అయిన తర్వాత పోరాడి 1000నుంచి 3000కు పెంచుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 89 వెలు మంది కార్మికులు ఉన్నారు. చంద్రబాబు స్వచంద సంస్థలకు ఇస్తామంటే పోరాడి తిప్పి కొట్టడం జరిగిందన్నారు. అక్షయ పాత్ర వంటి ప్రైవేటు సంస్థలు అందించే బోజనాలు పౌష్ఠికాహారం ఉండదన్నారు,అక్షయ పాత్ర వారు గుడ్డు వంటి పౌష్ఠికాహారం పెట్టారన్నారు. ఏ లక్ష్యం కోసం పథకం పెట్టారో ఆ లక్ష్యానికి తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు  వేతనాలు 1000 నుంచి ఇచ్చే వారన్నారు.నేడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం నేడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారన్నారు. అన్ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుమన్నారు.వేతనాలు పెంచుతామని జగన్మోహన్ రెడ్డి  చెప్పి పెంచలేదన్నారు.కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెన్ ఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెను చార్జీలు పెంచాలన్నారు. పేద మహిళలు,ఒంటరి మహిళలు అధిక సంఖ్యలో పని చేస్తున్నారు. 5వ తేదీ నాటికి వేతనాలు ఇవ్వాలని,కార్మికులగా వీరిని గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలు లో పని చేసే వారితో వెట్టి చాకిరి చేయించడం సరికాదన్నారు.యూని ఫారాలు ఇవ్వాలని, వంట పాత్రలు ఇవ్వాలని,రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. విలీన పాఠశాలలు లో పని ఇవ్వడం లేదన్నారు. తమ సమస్యలు అన్నింటి పై, జిల్లా, రాష్ట్ర మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి, రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. జిల్లా నాయకులు రామలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి వి రమణ, నాయకులు పి.శంకరరావు, ఏ.జగన్మోహన్ మాట్లాడారు. అనంతరం కార్యదర్శి నివేదికను జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సుధారాణి ప్రవేశ పెట్టారు.కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.