ప్రజాశక్తి - బి.కొత్తకోట : గ్లోబల్ హాస్పిటల్ అడ్వాంటేజ్ ఆర్థోపెడిక్స్& ఆప్తోలమాలజ మదనపల్లి వారి ఆధ్వర్యంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ శాశ్విత మరియు మోకాలు, తుంటి మార్పిడి నరాలు శాస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ అవినాష్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బి.కొత్తకోట పట్టణంలోని కొండా నరేంద్ర రెసిడెన్సీ మరియు కళ్యాణ మండపం నందు నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. ఉదయం 9.30 గంటల నుండి.ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం మరియు మోకాలు, తుంటి మార్పిడి నరాలు శాస్త్ర చికిత్స నిర్వహించడంతో భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి 70 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. మరో 58 మందికి మందులు కూడా అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొండా నరేంద్ర వైద్యులుకు సహాయ సహకారాలు అందించారు.










