Jan 02,2023 21:36

ఫొటో : వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న దృశ్యం

'మత్తు' నివారణపై అవగాహప
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : మత్తు పదార్థాలు వల్ల కలిగే నష్టాలను ఇందుకూరుపేట స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇన్‌స్పెక్టర్‌ ఎం.బాలకృష్ణ విద్యార్థులకు వివరించారు. సోమవారం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇన్‌స్పెక్టర్‌గా ఎం.బాలకృష్ణ సోమవారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎంకెర్‌ స్కూల్లో విద్యార్థులకు మత్తు కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాలు వస్తాయని, అసాంఘిక కార్యకలాలపై తమ నిఘా ఎప్పుడూ ఉంటుందని హెచ్చరించారు. నేటి బాల బాలికలే రేపటి పౌరులని, రాబోయే తరాల వారికి ఆదర్శంగా నిలావాలన్నారు. అదేవిధంగా పొగాకు, మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాటి వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.