తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని సమర్పిస్తున్న నాయకులు
మట్టి మాఫియా నుంచి గ్రామాన్ని కాపాడండి
కోవూరు: మండలంలోని పోతిరెడ్డి పాలెం గ్రామంలో ఉన్న మట్టి మాఫియా నుండి తమ గ్రామాన్ని కాపాడాలంటూ ఆ గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం తహశీల్దార్ పద్మజకు సిఇ రామకష్టారెడ్డి కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు తిరుమూరు అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కోవూరు పెన్నా పరిహారిక ప్రాంతంలోని పొర్లు కట్ట గ్రామంలోని అధికార పార్టీ చెందిన నాయకుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మట్టిని తవ్వేస్తున్నారని నిత్యం వందల ట్రాక్టర్లతో మట్టిని ఎత్తుతున్నారు గ్రామంలో ఉన్న స్మశానాన్ని సైతం వారి మట్టి దాహానికి బలవుతుందన్నారు ఈ మట్టి మాఫియా నుండి తమ గ్రామాన్ని కాపాడాలని వేడుకున్నారు గతంలో అనేకసార్లు పోలీసులకి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడంలేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి, ఎంపీటీసీ నాగరాజు, సూరిశెట్టి శ్రీనివాసులు , మాజీ ఎంపిటిసి తిరుమూరు రవీంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ అంగిరేకుల కష్ణ ప్రసాద్, జీవి నాగరాజు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.










