Apr 27,2023 22:00
  • రాష్ట్రపతి జోక్యానికి డిమాండ్‌
  • దేశవ్యాప్తంగా ఆందోళనలు 

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశం గర్వించదగ్గ అగ్రశ్రేణి క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడి చిత్రహింసలకు గురిచేసిన డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌, బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను కాపాడుతున్న బిజెపి, మోడీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా మోడీ సర్కార్‌ మౌనం దాల్చడం సిగ్గు చేటు అని ప్రజా సంఘాలు నినదించాయి. బ్రిజ్‌ భూషణ్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు, సిఐటియు, ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఐదు ప్రజా సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృత ప్రదర్శనలు, ధరాులు, మానహారాలు, మోడీ సర్కార్‌ దిష్టిబమ్మల దహనం, స్థానిక అధికారుల ద్వారా రాష్ట్రపతికి మెమోరాండాలు సమర్పించారు. ఈ ఆందోళనల్లో వేలాది మంది మహిళలు పాల్గనాురు. పంజాబ్‌, హర్యానా, గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఒడిస్సా, అస్సాం, మణిపూర్‌, త్రిపుర, జమ్మూ కాశ్మీర్‌లలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏడుగురు మహిళా రెజ్లర్లు (ఇందులో ఒకరు మైనర్‌) ఫిర్యాదులు చేసినప్పటికీ ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం దిగ్భ్రాంతికరమని, రాజధాని నగరంలో శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా పతనమైందని పేర్కొన్నారు. నిందితుడు అధికార పార్టీ బిజెపికి చెందిన పార్లమెంటు సభ్యుడని, నిందితులను రక్షించడానికి ప్రధానమంత్రి, ఆయన ప్రభుత్వం నరకయాతన పడుతుందని వాస్తవాన్ని ఇది నొక్కి చెబుతుందనిఅనాురు. బాధిత మహిళలు న్యాయం కోసం వీధిలో పడుకోవాల్సిన ఈ అరాచక పరిస్థితికి మోడీ ప్రభుత్వామే కారణమని పేర్కొన్నారు.

  • అట్టుడికిన ఢిల్లీ పోలీసు భవన్‌

క్రీడాకారుల ఫిర్యాదు మేరకుబ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ మహిళా సంఘాలు ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టాయి. ఐద్వా, ఎన్‌ఎఫ్డిడబ్ల్యుఎ, ఎఐఎంఎస్‌ఎస్‌, పిఎంఎస్‌, సిఎస్డబ్ల్యు సంఘాల నేతలు ఆందోళన చేశారు. ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పికె శ్రీమతి టీచర్‌, ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, ఐద్వా ఢిల్లీ అధ్యక్షురాలు మైమూనా మొల్లా తదితర నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నేతలను ఈడ్చుకెళ్లి బస్సులోకి ఎక్కించారు. ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు నేతలు ప్రయతిుంచగా పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు యాభై మంది మహిళ నేతలు పాల్గొన్నారు.

  • రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి..

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, నిందితులను అరెస్టు చేసి బాధిత మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగేలా ఢిల్లీ పోలీసులను, ప్రధానిని ఆదేశించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కోరారు. 'దేశ అత్యున్నత పరిపాలనా స్థానంలో ఉను మహిళగా మీ కనీస బాధ్యతని రాష్ట్రపతిగా మీ నుంచి ఆశిస్తున్నామ'ని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తక్షణమే రాజీనామా చేయాలని, అన్ని ఆరోపణలపై విచారణ జరిపి దోషులందరిపై కేసులు నమోదు చేయాలని రాష్ట్రపతిని కోరారు. క్రిమినల్‌ మాఫియాతో బాధితులను బెదిరించిన నేరానికి పాల్పడిన వారిని, ఫిర్యాదులను పట్టించుకోని కన్నాట్‌ ప్లేస్‌ పోలీస్‌ స్టేషన్‌లోనిపోలీసు అధికారులపైనా విచారణ చేపట్టాలని తపన్‌ సేన్‌ (సిఐటియు), విజూ కృష్ణన్‌ (ఎఐకెఎస్‌), బి. వెంకట్‌ (ఎఐఎడబ్ల్యుయు), మరియం ధావలే (ఐద్వా), హిమఘురాజ్‌ భట్టాచార్య (డివైఎఫ్‌ఐ), మయూఖ్‌ బిస్వాస్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ప్రకటన విడుదల చేశారు. ఈ నిరసనలో పాల్గను వారందరికీ అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

  • ఐదో రోజు కొనసాగిన రెజ్లర్ల ఆందోళన

రెజ్లర్ల ఆందోళన ఐదో రోజు కూడా కొనసాగింది. ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ లో ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు జంతర్‌ మంతర్‌ వద్ద జరుగుతున్న రెజ్లర్ల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పికె శ్రీమతి టీచర్‌, మరియం దావలే, నేతలు శైలజా టీచర్‌, సిఎస్‌ సుజాత, డివైఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి హిమఘురాజ్‌ భట్టాచార్య, ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూక్‌ బిశ్వాస్‌, జెఎన్‌ యు ఎస్‌ యు అధ్యక్షురాలు ఐషీఘోష్‌ తదితరులు సంఘీభావం తెలిపారు. ఆర్‌ఎల్డి నేత, రాజ్యసభ ఎంపి జయంతి చౌదరి, ఆర్‌ఎల్పి నేత, ఎంపి హనుమాన్‌ బెనివాల్‌ ఒలింపిక్‌ విజేత గీతా ఫోగట్‌ సంఘీభావం తెలిపారు. సత్యానిు ఇబ్బంది పెట్టవచ్చు కానీ ఓడిపోకూడదని రెజ్లర్‌ గీతా ఫోగట్‌ అనాురు.

  • పిటి ఉష వ్యాఖ్యలపై ఐద్వా అభ్యంతరం

న్యాయం కోసం ఆందోళన చేస్తును రెజ్లర్లు క్రమశిక్షణను ఉల్లంఘించారని ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు, బిజెపి ఎంపి పిటి ఉష తెలిపారు. ఒలింపిక్‌ సంఘం ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. వీధుల్లో నిరసనలు చేయడం మర్యాదలను ఉల్లంఘించడమేనని, ఇది దేశానికే సిగ్గుచేటని ఆమె వ్యాఖ్యానించారు. ఉష వ్యాఖ్యలను ఐద్వా అధ్యక్షులు పికె శ్రీమతి టీచర్‌ తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ వేదికలపై మువ్వనొల జెండాను రెపరెపలాడించినా క్రీడాకారిణీగా, మహిళలగా పిటి ఉషాను గౌరవిస్తామని, కానీ అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతికరమని పేర్కొనాురు. ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు.
ఉష వాదనలను తోసిపుచ్చిన ఒలింపిక్‌ బంగారు పతాక విజేత సాక్షి మాలిక్‌ కూడా తీవ్రంగా ఖండించారు. పిటి ఉషాకు తాము ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదనాురు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఒలింపిక్‌ సంఘం సిద్ధంగా లేదని కూడా బహిరంగంగానే ఉషా చెప్పారని ఈ సందర్భంగా సాక్షి తెలిపారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లకునిరసన తెలిపే హక్కు కూడా లేదా అని మాలిక్‌ నిలదీశారు.

  • క్రీడల మంత్రి బెదిరింపులు : రెజ్లర్ల ఆరోపణ

చర్చల పేరిట తమను క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ బెదిరింపులకు గురి చేసినటుల పలువురు రెజ్లర్లు వాపోయారు. రెజ్లర్లతో 12 గంటల పాటు చర్చలు జరిపామంటూ ఠాకూర్‌ బుధవారం పేర్కొన్నారు. ఒక కమిటీ కూడా వేశామనీ, ఎవ్వరైనా కమిటీతో సంప్రదింపులు జరపవచ్చునని ఆయన పేర్కొన్నారు. అయితే మంత్రి వ్యాఖ్యలను రెజ్లర్లు పూర్తిగా తప్పుబట్టారు. ఆయన చెప్పినట్లు రెజ్లర్లతో 12 గంటల కాదు కదా కనీసం ఒక గంట కూడా చర్చలు జరపలేదన్నారు. పైగా ఆందోళన విరమించుకొని రాజీకి రావాలంటూ బెదిరింపులకు దిగారని తెలిపారు. దీనిపై ప్రముఖ రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ ఘాటుగా స్పందించారు. 'మీరు ఒకరిని బెదిరిస్తే పది మంది అమ్మాయిలు వస్తారు' అనిఆమె హెచ్చరించారు. రెజ్లర్లకు వివిధ ప్రజాసంఘాలతో పాటు 29 ఖాప్‌ పంచాయతీలు, రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ఇంత జరుగుతున్నా మోడీ సర్కార్‌కు మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా లేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.