Apr 19,2023 16:52

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బుధవారం రాజంపేట రైల్వే స్టేషన్ లో కడపకు వెళ్లే దారిలో సూచిక బోర్డు కు సమీపంలో రైలు కింద పట్టాల పై పడి వ్యక్తి దుర్మరణం పొందాడు. తల, శరీరం వేరుగా పడిపోవడంతో చూసినవారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుడు ఎల్ఐసి ఏజెంట్ కె.వి రమణయ్యగా గుర్తించారు. ఆయన వృత్తిరీత్యా రాజంపేటలోని నూనె వారిపల్లిలోని స్వగృహానికి అప్పుడప్పుడు వచ్చేవారని., ప్రస్తుతం తిరుపతిలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. రమణయ్య స్వగ్రామం పుల్లంపేట మండలం వత్తలూరు సమీపంలోని బుగ్గ అగ్రహారం అని తెలిసింది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన విధానాన్ని బట్టి ఆత్మహత్యగా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రేణిగుంట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్య, లేక ఆత్మహత్య అన్న కోణంలో విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.