Nov 21,2020 06:32

కరోనా ధాటికి
ప్రపంచమంతా
శవాల కుప్పలైనా
సోయి రాలేదు మనిషికి
వైరస్‌ విధ్వంసానికి
శాస్త్ర విజ్ఞాన విరుగుడు
సరితూగలేదని తెలిసినా
పొగరు తగ్గలేదు మనిషికి
విలాసాల నిర్మించిన
వలసజీవి ఛిద్ర బతుకుపై
అలసత్వమింకా
ఏమాత్రం తగ్గలేదు మనిషికి
అజ్ఞానపు మూఢత్వం
అహంకారపు నీచత్వం
అధికారంకై క్రూరత్వం
తగ్గలేదు కొంతైనా మనిషికి
మనుషులు రెండు రకాలు
విధ్వంసకులు
పరిరక్షకులు
గుణపాఠం నేర్చుకోకపోతే
ఇద్దరూ మిగలరు ఈ భూమికి.
                                      * అమృతరాజ్‌