ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్వాడీలు
మహిళలపై దాడులకు నిరసనగా అంగన్‌వాడీల ర్యాలీ
ప్రజాశక్తి-గుంటూరు
దేశంలో రోజురోజుకీ మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా సిఐటియు అనుబంధ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం వేళాంగిణి నగర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ నగర కార్యదర్శి పి.దీప్తి మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దాడులను నివారించటంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. మహిళలు ఐక్యంగా కదిలి దాడులను తిప్పికొట్టాలని, ప్రభుత్వాలు దిగి వచ్చేలా నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ పాల్గొన్నారు.










