Sep 23,2023 14:45

నసురుల్లాబాద్‌ :అంగన్‌వాడీల నిరవధిక సమ్మె శనివారం 13వ రోజుకు చేరింది. నసురుల్లాబాద్‌ తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట ఎదుట ఆంగన్‌ వాడి టీచర్లు, ఆయాలు మోకాళ్లపై కూర్చొని, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు రూ.10 లక్షలు, మినీ టీచర్లకు రూ. 5 లక్షల బెనిఫిట్స్‌ అందజేయాలన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసి నెలకు రూ. 26 వేలు కనీస వేతనం అందజేయాలని డిమాండ్‌ చేశారు. జీవో నెంబర్‌ 14, 19, 8 లను వెంటనే సవరించాలన్నారు. కనీస వేతనాలు 26 వేలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు 10 లక్షలు టీచర్‌ కు ఆయాకు ఐదు లక్షలు అదే విధంగా టీచర్‌ రిటర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగ, ఆరోగ్య భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు,ఆయాలు ఉన్నారు.