ప్రజాశక్తి-చందర్లపాడు: మండల కేంద్రమైన చందర్లపాడులో స్థానిక బస్టాండ్ సెంటర్లో మంగళవారం దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ప్రచారజాత సిఐటియు మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ జాతను ఉద్దేశించి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని,లేబర్ కోడ్ లను రద్దుచేయాలని,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని,రైతు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను త్రిప్పికొట్టాలని,కార్మిక హక్కులను పరిరక్షించుకోవడానికి మార్చి 28,29 తేదీల్లో జరిగే రెండు రోజుల సమ్మెలో కార్మికులందరూ పాల్గొవాలని పిలుపునిచ్చారు. అలాగే మార్చి 23న విజయవాడలో జరుగు రైతు గర్జన సభను జయప్రదం చేయాలని, వైరస్ వల్ల నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరానికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, నిబంధనలు లేకుండా కౌలుదార్ల అందరికీ కౌలు కార్డు ఇవ్వాలని, తదితర డిమాండ్ పై మార్చి 23న ఉదయం 10 గంటలకు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద రైతు గర్జన సభకు రైతులందరూ తరలిరావాలని కోరారు. ఈ జాత ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్,సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ సి హెచ్ శ్రీనివాస్, సిఐటియు జిల్లా నాయకులు ఏ కమల మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు సందిపోగు లింగయ్య, వీరబాబు, జ్యోజిబాబు, బిక్షాలు నాయక్, కలకా జయరాజు,మరియదాసు, ప్రజానాట్యమండలి పి వెంకటేశ్వరరావు, బి శివ తదితరులు ఉన్నారు.










