Dec 25,2022 16:55

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ :  రాజంపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ కొండూరు విజయ్ కుమార్ రాజు తల్లి ధనలక్షమ్మ జ్ఞాపకార్థం ఆదివారం బాలసదన్ లో ఉన్న చిన్నారులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు వై.సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ పేద విద్యార్థులకు సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చైర్మన్ పోతుగుంట రామేష్ నాయుడు, డాక్టర్ బాలరాజు, కె.విజయ్ కుమార్ రాజు, నాసర్, రామచంద్ర రాజు, వెంకట సుబ్బయ్య, కోశాధికారి నరసింహ రాజు తదితరులు పాల్గొన్నారు.