Jun 02,2023 16:50

ప్రజాశక్తి-కలికిరి : రీ సర్వేకు రైతులు సహకరిస్తేనే భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆర్డీవో మురళి తెలిపారు. స్థానిక మండల కేంద్రంలోని కలికిరి పతేగాడు పంచాయతీలోని కొర్లగుంట గ్రామాలలో జరుగుతున్న రీ సర్వే కార్యక్రమాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ డ్రోన్ సహాయంతో తీసిన చిత్రాలపై భూమిమీద రీసర్వే జరుగుతున్న సమయంలో సంబంధిత రైతులు తమ పాస్ బుక్కులు, దస్తావేజులు గాని చూపించి తమకు ఉన్నటువంటి సమస్యలను అధికారుల ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. చిన్న చిన్న తగాదాలు, బాగ పరిష్కారాలు, తదితర సున్నితమైన సమస్యలు, లేకుండా అధికారులకు రైతుల సహకరించి ఈ సర్వేకి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం కలికిరి తాసిల్దార్ కార్యాలయంలో జగనన్న కాలనీలను కరెక్టుగా తన పూర్తి చేయాలని హౌసింగ్ ఏఈ కి సూచించారు. ప్రజలకు రేషన్ పంపిణి సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తాసిల్దారు భాగ్యలతకు సూచించారు.