న్యూఢిల్లీ : కరోనా నిబంధనలను పూర్తిగా సడలించిన తర్వాత కూడా ఇ-కామర్స్ అమ్మకాలకు డిమాండ్ పెరగనుందని తమ సర్వేలో వెల్లడయ్యిందని ఫెడ్‌ఎక్స్ పేర్కొంది. భవిష్యత్తులోనూ ఆన్‌లైన్ అమ్మకాలు కొనసాగుతాయని 80 శాతం మధ్యస్థ, 58 శాతం చిన్న వ్యాపారాలు అభిప్రాయపడ్డారు. కొవిడ్-19 మహమ్మారి కాలంలో ఎస్‌ఎంఇలలో ఇ-కామర్స్‌లో ట్రెండ్‌లుాడిజిటల్ స్వీకరణపె పరిశోధన సంస్థ డూన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డిఅండ్‌బి)ఇండియాతో కలిసి సంయుక్తంగా ఓ సర్వేను చేపట్టినట్లు సరుకు రవాణ సంస్థ ఫెడ్‌ఎక్స్, తెలిపింది. కరోనా ముగిసిన తర్వాత డిజిటల్ చెల్లింపుల పెరుగదల నమోదువుతోందని 76 శాతం చిన్న వ్యాపారాలు, 6 శాతం మధ్య స్థాయి వ్యాపారాలు అంచనా వేశారు.










