Apr 18,2023 19:05

నిరసన దీక్ష చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -ఉలవపాడు :మండలంలోని సుబ్బరాయుడు సత్రం రైల్వే గేటు నెం177 వద్ద మంగళవారం 18వరోజు నిరసన దీక్షా శిబిరం కొనసాగుతుంది. మండుటెండలో వడగాలులను సైతం లెక్కచేయకుండా నిరసన దీక్షా శిబిరాన్ని మహిళలు కొన సాగిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైల్వే గేట్‌ అండర్‌ పాస్‌ పనులు నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు.