Feb 05,2021 10:21

కొడిపల్లి (అనంతపురం) : లేపాక్షి పిఎస్‌ ఎస్‌ఐ ఆధ్వర్యంలో కొడిపల్లి గ్రామంలో శుక్రవారం కార్డన్‌సెర్చ్‌ను నిర్వహించారు. అనంతరం గ్రామసభ నిర్వహించి ఎస్‌ఐ ప్రజలతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎవరైనా అల్లర్లు చేస్తే వారిపై క్రిమినల్‌ కేస్‌ లు నమోదు చేసి రౌడి షీట్స్‌ ఓపెన్‌ చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంపిణీ చేయకూడదని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కుని ఉపయోగించుకోవాలని అన్నారు. నామినేషన్‌ రోజు నామినేషన్‌ కేంద్రానికి అభ్యర్థి, అతన్ని బలపరచే ఇద్దరు వ్యక్తులు మాత్రమే రావాలని, ఎవరైనా ఘర్షణలకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎస్‌ఐ హెచ్చరించారు.