పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డాక్టర్లు
నారాయణ దంత వైద్యశాలలో
కేవలం రూ.1000 /-లకే పూర్తి కట్టుడు పళ్ల సెట్
ప్రజాశక్తి-నెల్లూరు:అక్టోబర్ 1వతేదీ ప్రపంచ వద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణ దంత వైద్యశాలలో రు.15 వేలు ఖర్చు అయే కట్టుడు పళ్ళ సెట్ కే రూ 1000 /- లకు అందిస్తున్నట ్లఆ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అజరు రెజీనాల్డ్ తెలిపారు . శనివారం నారాయణ వైద్యశాలు నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మలి దశలో దంత సంభందించిన సమస్యలు రావడం జరుగుతుందన్నారు. దంతాలు అందానికే కాదు ఆరోగ్యానికి అవసరమని,ఆహారం నమిలి మింగాలన్నా, మాటలు స్పష్టంగా రావాలన్నా, భావాన్ని వ్యక్త పరచాలన్నా, దంతాల అవసరం చాల ఉంటుందన్నారు. ఈ సమస్యలు అధికమించేందుకు నారాయణ వంత వైద్యశాల, కట్టుడు పళ్ళ చికిత్సా విభాగం వారి ఆధ్వర్యంలో రూ.1000/- లకే పూర్తి కట్టుడు పళ్ళ సెట్ తీసిపెట్టుకొనే విధంగా అమర్చేదన్నారు.నారాయణ దంత వైద్య కళాశాల కో ఆర్డినేటర్ డాక్టర్ కెవి. సునీల్ మాట్లాడుతూ, ప్రపంచ వద్ధుల దినోత్సవం సందర్శముగా నారాయణ దంత వైద్యశాల నందు రాయితీతో కూడిన కట్టుడు పళ్ళ శిబిరంలో ఇతర దంత సమస్యలు అనగా చిగుళ్ల సమస్యలు, వంటి శస్త్ర చికిత్సలు, తదితర సమస్యలకు కూడా నామమాత్రపు ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. నారాయణ దంత వైద్య కళాశాల, కట్టుడు పళ్ళ చికిత్సా విభాగపు ప్రొఫెసర్ డాక్టర్ వి. దిలీప్ నాగ్ మాట్లాడుతూ దంతాలు మలి వయస్సులో ఊడిపోవడానికి అనేక కారణాలు వుంటాయని, ముఖ్యంగా దంతాలు పరిశుభ్రంగా వుంచుకోకపోవడం, దంత సమస్యను నిర్లక్ష్యం చేయడం వంటివి జరుగుతుంటాయి. నారాయణ దంత వైద్యశాల నందు కట్టుడు పళ్ళ చికిత్సా విభాగానికి అనుబంధంగా 8రకాల దంత చికిత్సా విభాగాలు దంత సంరక్షణ కోసం అందుబాటులో వున్నాయన్నారు.నారాయణ మెడికల్ కాలేజ్ ఏజిఎం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వద్ధుల దినోత్సవం సందర్భముగా సెప్టెంబర్ 25 వ తేది నుండి అక్టోబర్ 25 వ తేది వరకు నామమాత్రపు ఖర్చుతో పూర్తి కట్టుడు పళ్ళ శిబిరం అందుబాటులో వుంటుందన్నారు, దీనికి సంభందించి సలహా సంప్రదింపులకు, ఇతర వివరములు ఫోన్ నెంబర్: 7780473823 సంప్రదించాలన్నారు.ఈ సమావేశంలో నారాయణ దంత వైద్య కళాశాల వైద్యులు డాక్టర్ టి. పవన్ కుమార్, డాక్టర్ వి. వంశీ కష్ణ రెడ్డి, డాక్టర్ కెవి.శరత్ బాబు, ఏడి. అరవింద్ రెడ్డి పాల్గొన్నారు










