Jan 26,2021 21:24

సమావేశంలో మాట్లాడుతున్న రమణ

శృంగవరపుకోట : రానున్న పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని విశాఖ డిసిసి అధ్యక్షులు భోగి రమణ అన్నారు. మంగళవారం పట్టణంలోని సుబ్బిరామిరెడ్డి కల్యాణ మండపంలో మండలస్థాయి నాయకులు కార్యకర్తలతో సమావేశంలో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు వల్ల రైతులకు, ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్న విషయం కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారం చేసి రైతులకు, ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు. వచ్చే నెలలో జరగబోయే ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పని చేసి పార్టీ విజయానికి కృషి చేయాలని, అందుకు కార్యకర్తలకు కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సేవాదళ్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ సీతంనాయుడు, పార్టీ సీనియర్‌ నాయకులు మణిబాబు, నాయకులు మట్ట వీరభ్ర