వాషింగ్టన్ : తమ రాష్ట్రంలో బైడెన్ గెలిచారంటూ జార్జియా గవర్నర్ బైరాన్ కెంప్ ధ్రువీకరించారు. ట్రంప్ మద్దతుదారుల అభ్యర్థన మేరకు జార్జియాలోని 16 ఎలక్టోరల్ కాలేజీలకు చెందిన 50 లక్షల ఓట్లను చేతితో లెక్కింపు నిర్వహించామని అన్నారు. దీంతో అధ్యక్ష ఎన్నికలలో తన ఓటమిని అంగీకరించకుండా ఆరోపణలు చేస్తున్న అధ్యక్షుడు ట్రంప్‌కు మరో ఎదురు దెబ్బతగిలింది. బైడెన్‌కు 12,670 ఓట్ల ఆధిక్యం లభించందని, మొదటి లెక్కింపు ఆడిట్‌ను ప్రకటించారు. ట్రంప్ మద్దతుదారులు జార్జియా విదేశాంగ కార్యదర్శి బ్రాడ్ రాఫెన్స్‌పెర్గర్, ఇతర రిపబ్లికన్ల మాదిరిగానే తమ రాష్ట్రంలో ట్రంప్ గెలవకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. ప్రజలు మోసపోయామని తెలుసుకుంటారని అన్నారు.










