ముంబయి: టీమిండియా వెటరన్ క్రికెటర్, ఓపెనర్ సుధీర్ నాయక్(78) బుధవారం కన్ను మూశారు. 1974-75 మధ్య కాలంలో భారత్ తరఫున మూడు టెస్టులు, రెండు వన్డేలు ఆడిన నాయక్.. దాదర్‌లోని తన నివాసంలో కాలుజారి పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారకస్థితిలో ఉన్న నాయక్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. ముంబయి జట్టు 1970-71లో రంజీట్రోఫీ గెలిచిన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ముంబయి తరఫున 85ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఆడిన నాయక్.. ఏడు సెంచరీలు, 27అర్ధసెంచరీలతో సహా మొత్తం 4,376పరుగులు చేశారు.
1970-71లో ముంబయి జట్టు రంజీట్రోఫీ సాధించడంలో కీలకపాత్ర పోషించారు.
ఆ తర్వాతి కాలంలో ముంబయి జట్టు అజిత్ వాడేకర్, సునీల్ గవాస్కర్ నేతృత్వంలో వెస్టిండీస్‌పై చారిత్రాత్మక సిరీస్ గెలుపులోనూ పాలుపంచుకున్నారు.










