Jun 14,2023 15:57

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ ఇటీవలే టెస్ట్‌ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. టెస్టు రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకోవడం వెనుక ప్రధాన కారణం బెన్‌స్టోక్స్‌ అని మొయిన్‌ అలీ రివీల్‌ చేశాడు. స్టోక్స్‌ చెప్పిన యాషెస్‌ అనే ఒక్క పదం తనను మళ్లీ టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చేలా చేసిందన్నాడు. తొలి టెస్టు సందర్భంగా ఎడ్జ్‌బాస్టన్‌లో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మొయిన్‌ అలీ మాట్లాడాడు. ''స్టోక్స్‌ నేను సరదాగా చాట్‌ చేసుకుంటున్నాం. ఆ సమయంలో యాషెస్‌? అని అడిగాడు. అయితే ఆ సమయంలో జాక్‌ లీచ్‌ గాయపడ్డాడని నాకు తెలియదు. దీంతో లోల్‌ అని మెసేజ్‌ చేశా. అంతే స్టోక్స్‌ నవ్వుతో అయితే సిద్ధంగా ఉండు అని పేర్కొన్నాడు. అప్పుడు ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత జాక్‌ లీచ్‌ గాయపడ్డాడని తెలిసింది. ఆ తర్వాత స్టోక్స్‌కు ఫోన్‌ చేసి చాలాసేపు మాట్లాడాను. ఈ నేపథ్యంలో యాషెస్‌లో నీ అవసరం ఉందని స్టోక్స్‌ నాతో అన్నాడు. రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకోవడంపై ఒకసారి ఆలోచించు అని తెలిపాడు. ఒక కెప్టెన్‌ నన్ను కన్విన్స్‌ చేయడానికి ప్రయత్నించడం నచ్చింది. ఈసీబీకి చెప్పి రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్నా. టెస్టుల్లో నా కమ్‌బ్యాక్‌కు బెన్‌స్టోక్స్‌ ప్రధాన కారణం అని కచ్చితంగా చెప్పగలను'' అంటూ తెలిపాడు.