Jun 05,2023 21:50
  • బంగ్లాదేశ్‌లో భారత్‌ ఆర్మీ చీఫ్‌ పర్యటన

ఢాకా : భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే సోమవారం బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ షఫియుద్దీన్‌ అహ్మద్‌తో ఇక్కడ సమావేశమయ్యారు. రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం పాండే సోమవారం ఉదయం ఇక్కడకువచ్చారు. పరస్పర ప్రయోజనకరమైన వివిధ అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక రక్షణ, భద్రతా సంబంధాలను మరింతగా విస్తరించుకునేందుకుగల మార్గాలను అన్వేషించారు. ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బంగ్లాదేశ్‌కురావడం ఇది రెండవసారి. గత జులైలో మొదటసారి వచ్చారు. సాయుధ బలగాల విభాగ ప్రిన్సిపల్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌తో కూడా ఆయన సమావేశమయ్యారు. బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలో అశువులు బాసిన అమర వీరులకుమనోజ్‌ పాండే నివాళి అర్పించారు. సేనకుంజ వద్ద ఆయనకుగార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ లభించింది. ఇరు దేశాల సైన్యాల మధ్య గల సుేహ బంధానికి గుర్తుగా ఒక మొక్కను నాటారు. చత్తొగ్రామ్‌లోనిబంగ్లాదేశ్‌ మిలటరీ అకాడమీ (బిఎంఎ)లో 84వ లాంగ్‌ కోర్స్‌ ఆఫీసర్‌ కేడెట్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ను జనరల్‌ పాండే తిలకిస్తారు. ఈ సందర్భంగా మిత్ర దేశాలకుచెందిన ఉత్తమ విదేశీ కేడెట్‌కుబంగ్లాదేశ్‌, భారత్‌ ఫ్రెండ్‌షిప్‌ ట్రోఫీ అందచేస్తారు.