న్యూఢిల్లీ : జీవవైవిధ్య పరిరక్షణ, భద్రత, పునరుద్ధరణ మరియు సుసంపన్నతపై చర్యలు చేపట్టడంలో భారత్ ముందంజలో ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన జి 20 పర్యావరణ మరియు వాతావరణ సుస్థిరతపై మంత్రి వర్గ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. భారత్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించిందని చెప్పేందుకు గర్వపడుతున్నానని ప్రధాని అన్నారు. భారత్ 2030కి నిర్దేశించిన లక్ష్యం కంటే తొమ్మిదేళ్లు ముందుగానే, శిలాజ రహిత ఇంధన వనరుల నుండి వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని సాదించిందని అన్నారు. పునరుత్పాదక ఇంధన స్థాపన సామర్థ్యంలో భారత్ ప్రపంచంలోని మొదటి ఐదు దేశాలలో ఒకటిగా ఉందని అన్నారు. అలాగే ప్రాజెక్ట్ టైగర్ కోసం అంతర్జాతీయ పెద్ద ప పులుల కూటమిని ప్రారంభించామని, ప్రాజెక్ట్ లయన్, ప్రాజెక్ట్ డాల్ఫిన్ లను కూడా చేపట్టామని అన్నారు.