Jul 30,2022 17:36

ప్రజాశక్తి-చందర్లపాడు: నందిగామలో పట్టణం రైతుపేటలో నివాసం ఉంటున్న జాస్తి. హరిత వర్షిని కుటుంబ సభ్యులుపై ఎస్.బి.ఐ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు వేధింపులు గురిచేయడం వల్లే ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం జరిగిందని తెలిపారు. మండలంలోని కోడవటికల్లు గ్రామంలో  నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులను ప్రజాసంఘాల నాయకులు కలిసి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగిందని అన్నారు. చనిపోయిన ఇంటర్ విద్యార్థిని జాస్తి హరిత వర్షిని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 25లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని  ప్రజాసంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా కౌలు రైతుసంఘం జిల్లా అధ్యక్షులు చనుమోలు. సైదులు, సిఐటియు నందిగామ కార్యదర్శి కె.గోపాల్ మాట్లాడుతూ SBI బ్యాంక్ వారు బయట వ్యక్తులకు రుణాలు వసూలు చేయమని ఆదేశాలు ఇచ్చి రికవరీ ఏజెంట్ల ద్వారా బ్యాంకు సంబంధించిన హరిత వర్షిని ఇంటికి పంపించి వేధింపులు గురిచేసారని వారు అన్నారు. ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి మహిళలపట్ల అసభ్యంగా మాట్లాడటం ఏమిటని అన్నారు. అసభ్యకరంగా మాట్లాడిన వారిపై నిర్భయ చట్టం కింద కేసు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారు చేసిన నిర్వాకం వల్ల ఆవిద్యార్థి మానసికంగా ఇబ్బందులు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరమని తెలిపారు. విద్యార్థి ఆత్మహత్యకు కారుకులైన ఫైనాన్సు ఏజెంట్లపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మరియు కేసులు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని కోరారు. ప్రభుత్వం నుంచి విద్యార్థి కుటుంబానికి 25లక్షల రూపాయలు ఇవ్వాలని మరియు కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, దీనితోపాటు ఆకుటుంబంలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థికి చదువు  పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరారు. మరియు ఇలాంటి ఘటనలు పునరావితం కాకుండా ప్రభుత్వ అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి గోపి నాయక్ ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ, ఆదిత్య చైతన్య కళాశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.