ప్రజాశక్తి - ఇబ్రహీంపట్నం (ఎన్‌టిఆర్ జిల్లా) : గోదావరి వరద ముంపు ప్రాంతాలను సందర్శించేందుకు వెళుతున్న మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇబ్రహీంపట్నంలో ఘన స్వాగతం లభించింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మైలవరం నియోజకవర్గ టిడిపి నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చారు.










