- వేతన పెంపుపై సర్కారు మీనమేషాలపై ఆగ్రహం
లండన్ : దీర్ఘకాలంగా వేతన పెంపునకు సంబంధించి రిషి సునాక్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ ఇంగ్లండ్ వ్యాప్తంగా టీచర్లు మరోసారి సమ్మె చేయనున్నారు. జులై 5, 7 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు సమ్మె ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. ప్రాధమిక, మాధ్యమిక పాఠశాలలు పూర్తిగా లేదాపాక్షికంగా మూతపడతాయి. ప్రస్తుతమును ద్రవ్యోల్బణాని కన్నా చాలా తక్కువ స్థాయిలో అంటే 4.3శాతం వేతన పెంపును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిని నాలుగు ప్రధాన ఉపాధ్యాయ సంఘాల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో తిరిగి చర్చలు చేపట్టాల్సిందిగా సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా పాఠశాలల బడ్జెట్‌ను పెంచాలని, వేతన పెంపు కోసం అదనుపు నిధులు అందచేయాలని ఎన్‌ఇయు, ఎన్‌ఎఎస్‌యుడబ్ల్యుటి, ఎన్‌ఎహెచ్‌టి, ఎఎస్‌సిఎల్ డిమాండ్ చేశాయి.. తీసుకోవాల్సిన కార్యాచరణ అంతా విద్యాశాఖ మంత్రి గిలియన్ కీగన్ పరిధిలోనే వుందనిఎన్‌ఇయు జాయింట్ ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మేరీ బూస్ట్‌డ్, కెవిన్ కోర్టీు చెప్పారు. ఈ వివాదానిు త్వరగా పరిష్కరించేందుకు సత్వరమే చర్చలు జరపాల్సిందిగా ప్రతీసారి తాము విద్యా శాఖ మంత్రిని కోరుతున్నామని వారు చెప్పారు. స్కాట్లండ్, వేల్స్‌ల్లో వేతన వివాదాలను పరిష్కరించారు. ఇంగ్లండ్‌లో మాత్రం ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడంపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు స్పందిస్తూ, ఎవరూ కావాలని సమ్మె కార్యాచరణకు దిగాలని అనుకోరు, కానీ ఈ వివాదాన్ని పరిష్కరించే ఉద్దేశ్యమే తమకు లేనట్లు విద్యాశాఖ మంత్రి వ్యవహరిస్తున్నప్పుడు ఉపాధ్యాయులకు మరో ప్రత్యామాుయం లేకపోయిందని చెప్పారు.










