Feb 08,2023 16:44


దుబాయ్ : ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 రెండో ఎడిషన్‌ ఫైనల్‌ మ్యాచ్‌కి తేదీలు ఖరారు అయ్యాయి. లండన్‌లోని ఓవల్‌ వేదికగా జూన్‌ 7వ తేదీ నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుందని ఐసీసీ తెలిపింది. అలాగే మ్యాచ్‌ రద్దయితే జూన్‌ 12ను రిజర్వ్‌డేగా ప్రకటించింది. ఇక వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ మొదటి ఎడిషన్‌ను న్యూజిలాండ్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ ఫైనల్లో విజయం సాధించింది. అయితే ప్రస్తుతం 75.56 విన్నింగ్‌ పర్సెంటేజ్‌తో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఆస్ట్రేలియా ఉండగా%ౌౌ% 58.93 శాతం విజయాలతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. కాగా.. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా 4-0 తేడాతో ఓడిపోతే మాత్రం సీన్‌ మారిపోయే అవకాశం ఉంది. అలాకాకుండా భారత్‌ కనీసం 2 విజయాలు అందుకున్నా, ఆస్ట్రేలియాతో కలిసి డబ్ల్యూటీసీ ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది.