Jul 13,2023 14:52

ఢిల్లీ: తాను పోలీసునంటూ ఓ అమ్మాయిని బెదిరించి అత్యాచారానికి ఒక వ్యక్తి పాల్పడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జులై 7న ఓ కాలేజీ విద్యార్థిని తన బారుఫ్రెండ్‌తో కలిసి కారులో వెళ్తుండగా ఓ వ్యక్తి బైక్‌పై వారిని అనుసరించాడు. వారి ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ అమ్మాయిని ఇంటిదగ్గర దిగబెట్టి బారుఫ్రెండ్‌ వెళ్లగానే నిందితుడు ఆమె దగ్గరకు వచ్చాడు. తాను పోలీసునని చెప్పి.. ఆమె వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌ బయటే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుణ్ని అరెస్టు చేసినట్లు తెలిపారు.