- రోహిత్ అర్ధసెంచరీ
- ఆస్ట్రేలియా 177ఆలౌట్, ఇండియా 77/1
నాగ్‌పూర్ : తొలి టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లకి తోడు అశ్విన్ మెరుపులకు తోడు.. రోహిత్ శర్మ అర్ధసెంచరీతో కదం తొక్కడంతో తొలిరోజు టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 177పరుగులకే ఆలౌట్ చేసింది. గాయంనుంచి కోలుకున్న తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న రవీంద్ర జడేజా(5/47), అశ్విన్(3/42) బౌలింగ్‌లో అదరగొట్టారు. తొలుత భారత పేసర్లు షమీ(1/18), సిరాజ్(1/30) ఆరంభంలోనే ఆసీస్ ఓపెనర్లు ఖవాజా(1), డేవిడ్ వార్నర్(1)లను ఔట్ చేశారు. ఆ తర్వాత లబూషేన్(49: 123 బంతుల్లో), స్టీవ్ స్మిత్ (37: 107 బంతుల్లో) కాసేపు అడ్డుపడినా.. రవీంద్ర జడేజా, అశ్విన్ ఆసీస్ జట్టుకు ముచ్చెమటలు పట్టించడంతో తొలిరోజే ఆస్ట్రేలియా జట్టు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ శుభారంభం అందించారు. రోహిత్(56నాటౌట్) అర్ధసెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(20) వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోయి 77పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ రెండేళ్ల తర్వాత టెస్టుల్లో అర్ధశతకం కొట్టాడు. ఇక కేఎల్ రాహుల్ (20)మర్ఫీ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్యాడు. నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ క్రీజ్‌లో ఉన్నాడు.
- స్కోర్‌బోర్డు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (బి)షమీ 1, ఖవాజా (ఎల్‌బి)సిరాజ్ 1, లబూషేన్ (స్టంప్)భరత్ (బి)జడేజా 49, స్మిత్ (బి)జడేజా 37, రేన్‌షా (ఎల్‌బి)జడేజా 0, హ్యాండ్‌కోంబ్ (ఎల్‌బి)జడేజా 31, క్యారీ (బి)అశ్విన్ 36, కమిన్స్ (సి)కోహ్లి (బి)అశ్విన్ 6, మర్ఫె (ఎల్‌బి)జడేజా 0, లియాన్ (నాటౌట్) 0, బోలండ్ (బి)అశ్విన్ 1, అదనం 15. (63.5ఓవర్లలో ఆలౌట్) 177పరుగులు.
వికెట్ల పతనం: 1/2, 2/2, 3/84, 4/84, 5/109, 6/162, 7/172, 8/173, 9/176, 10/177
బౌలింగ్: షమీ 9-418-1, సిరాజ్ 7-3-30-1, జడేజా 22-8-47-5, అక్షర్ 10-3-28-0, అశ్విన్ 15.5-2-42-3.
ఇండియా తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 56, కేఎల్ రాహుల్ (సి అండ్ బి)మర్ఫీ 20, అశ్విన్ (బ్యాటింగ్) 0, అదనం 1, (24ఓవర్లలో వికెట్ నష్టానికి) 77పరుగులు.
వికెట్ల పతనం: 1/76
బౌలింగ్: కమిన్స్ 4-1-27-0, బోలండ్ 3-1-4-0, లియాన్ 10-3-33-0, మర్ఫీ 7-0-13-1.
Stumps on Day 1️⃣ of the first #INDvAUS Test!#TeamIndia finish the day with 77/1, trailing by 100 runs after dismissing Australia for 177 👌🏻
— BCCI (@BCCI) February 9, 2023
We will see you tomorrow for Day 2 action!
Scorecard - https://t.co/edMqDi4dkU #INDvAUS | @mastercardindia pic.twitter.com/yTEuMvzDng










