ఉత్తరకాశీ (ఉత్తరాఖండ్) : ఉత్తరాఖండ్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 3.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం 8.35 గంటల సమయంలో ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూకంపం సంభవించింది. వెడల్పు : 31.07, పొడవు 77.98, ఐదు కిలోమీటర్ల లోతుమేర భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్ అధికారిక ఎక్స్‌లో పోస్టు చేసింది.










