Jun 23,2023 16:49

అక్రా : పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనాలోని కార్మికులకు చైనా వైద్యబృందం ఉచితంగా వైద్యసేవలనందించింది. ఘనా వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం.. చైనా రైల్వే నెం.5 ఇంజనీరింగ్‌ గ్రూప్‌ అనే కంపెనీ ప్రభుత్వ యాజమాన్యంలో గత 20 ఏళ్లుగా నడుస్తోంది. ఈ కంపెనీ అక్కడ ప్రధాన రహదారులు, వంతెనల్ని నిర్మిస్తుంది. ఘనా రాజధాని ఆక్రాలోని ఈ కంపెనీలో పనిచేస్తున్న ఐదు వందల మందికిపైగా కార్మికులకు, ఉద్యోగులకు గురువారం చైనా వైద్య బృందంలోని 12వ బ్యాచ్‌ ఉచితంగా వైద్య సేవలనందించింది. ఈ సందర్భంగా ఈ కంపెనీ చీఫ్‌ డు యుషాన్‌ మాట్లాడుతూ... 'ఘనా కార్మికులకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు చైనా వైద్య బృందం మా సహాయాన్ని కూడా తీసుకోవాలని మేము ఆశిస్తున్నాము. మేము ఇక్కడున్న కార్మికులు మందులు తీసుకువచ్చాము. మా వైద్యులు వారికి ఆరోగ్య సలహాలను కూడా అందిస్తారు. ఈ వైద్య బృందం ఇక్కడ సంవత్సరంపాటు బసచేస్తుంది. ఈ కాలంలో మరో నాలుగుసార్లు లోకల్‌ కమ్యూనిటీలలో ఉచిత వైద్య సేవలందించేందుకు ఈ బృందం యోచిస్తోంది. మాకు ఇక్కడ వీరు వైద్య సేవలందించడం మొదటిసారికాదు. ఈ బృందం ఇలా చేయడం సంతోషంగా ఉంది' అని ఆయన అన్నారు.
కాగా, పదకొండు మందితో కూడిన ఈ వైద్య బృందం ఈ ఏడాది మార్చిలో దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ జనరల్‌ హాస్పిటల్‌ నుండి వచ్చిందని అధికారిక నివేదిక పేర్కొంది.