Feb 08,2023 21:57
  • రంజీట్రోఫీ సెమీఫైనల్స్‌

రంజీట్రోఫీ సెమీఫైనల్లో బెంగాల్‌ జట్టు బ్యాటర్స్‌ రాణించారు. సుదీప్‌ కుమార్‌ ఘరామీ(112), అనుస్తుప్‌ మజుందార్‌(120) శతకాలతో రాణించడంతో దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్‌ జట్టు 4 వికెట్ల నష్టానికి 307పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్‌(27), కరణ్‌ లాల్‌(23)లకు భారీస్కోర్‌ చేయడంలో విఫలమయ్యారు. కరణ్‌ లాల్‌(23), అభిమన్యు ఈశ్వరన్‌(27) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. దీంతో బెంగాల్‌ జట్టు 51పరుగులకే 2వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సుదీప్‌, మజుందార్‌ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ 3వ వికెట్‌కు (242పరుగులు) డబుల్‌ సెంచరీ భాగస్వామ్యాని నెలకొల్పారు. తొలిరోజు ఆట నిలిచే సమయానికి కెప్టెన్‌ మనోజ్‌ తివారి(5), షాబాజ్‌ అహ్మద్‌(6) క్రీజ్‌లో ఉన్నారు. మధ్యప్రదేశ్‌ బౌలర్లలో అనుభవ్‌ అగర్వాల్‌కు రెండు, ఆవేశ్‌ ఖాన్‌, గౌరవ్‌ యాదవ్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

  • కర్ణాటక 229/5

సౌరాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీస్‌లో కర్ణాటక జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్‌, ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(110) అజేయ సెంచరీకి తోడు వికెట్‌ కీపర్‌ శ్రీనివాస్‌ శరత్‌(58) అర్ధసెంచరీతో రాణించాడు. రవికుమార్‌(3), దేవదత్‌ పడిక్కల్‌(9), మనీష్‌ పాండే(7) నిరాశపరిచారు తొలిరోజు ఆట ముగిసే సమయానికి మయాంక్‌, శ్రీనివాస్‌ క్రీజ్‌లో ఉన్నారు. కుశాంగ్‌ పటేల్‌కు రెండు, చేతన్‌ సకారియా, మన్కడ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.