ముంబయి : టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు ముంబయిలోని ధీరూభారు అంబానీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. దాదాపు 40 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న పంత్ తన ఆరోగ్యం గురించి తాజాగా సమాచారం ఇచ్చాడు. బాల్కనీలో కూర్చున్న ఫొటోను పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇన్నాళ్లకు బయటకు వచ్చి స్వచ్చమైన గాలి పీల్చుకున్నట్లు తెలిపాడు. ''ఇలా బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే ఇంత హాయిగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆల్ ఈజ్ వెల్'' అని పంత్ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా మోకాళ్లకు శస్త్రచికిత్స కావడంతో అతను తిరిగి మైదానంలోకి రావడానికి కనీసం ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. పంత్ పూర్తిగా కోలుకొని ఫిట్‌నెస్ సాధిస్తే ఈ ఏడాది చివర్లో జరిగే టి20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ఉంది.











