- ఆసీస్ లక్ష్యం 76పరుగులు
ఇండోర్: ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ దెబ్బకు టీమిండియా బ్యాటర్స్ చేతులెత్తేశారు. టెస్ట్ బ్యాటర్ ఛటేశ్వర పుజారా(59) అర్ధసెంచరీకి తోడు శ్రేయస్(26) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. నాథన్ లియాన్(8/64) దెబ్బకు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్ ముందు 76 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. అంతకుముందు 4వికెట్ల నష్టానికి 156 పరుగులతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ జట్టు 197పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ప్రారంభం నుంచే టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. తొలుత ఆచి తూచి ఆడినా.. కామెరూన్ గ్రీన్(19), హాండ్స్‌కాంబ్(19) ఔటయ్యాక ఆసీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ క్యూ కట్టారు. క్యారీ(3), స్టార్క్(1), లియాన్(5), మర్ఫీ(0) స్వల్ప స్కోర్‌లకే పెవీలియన్‌కు చేరడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 197పరుగుల వద్ద ముగిసింది. దీంతో ఆసీస్‌కు 71పరుగుల ఆధిక్యత లభించింది. జడేజాకు నాలుగు, అశ్విన్, ఉమేశ్‌కు మూడేసి వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు శుభ్‌మన్(5), రోహిత్(12) ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ స్పిన్నర్ లియాన్ ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 109పరుగులు చేయగా.. ఆసీస్ 197పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 88పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది.
- పుజారా అడ్గు గోడలా..
రెండో ఇన్నింగ్స్‌లో టెస్ట్ బ్యాటర్ పుజారా అడ్డు గోడలా నిలిచాడు. ఆస్ట్రేలియా స్పిన్ త్రయాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీ సాధించాడు. కుహ్నెమన్ ఓవర్‌లో సింగిల్ తీసి 50 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. జడేజా (7), శ్రేయస్ అయ్యర్(26)తో కలిసి స్కోర్‌బోర్డును ముందుకు నడిపించాడు. దీంతో భారతజట్టు టీ విరామ సమయానికి 4వికెట్ల నష్టానికి 79పరుగులు చేసింది. పుజారా చివరకు లెగ్ స్లిప్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ అద్భుత క్యాక్‌కు పుజారా ఔటయ్యాడు. లోయర్ ఆర్డర్‌లో అశ్విన్(16), అక్షర్ పటేల్(15) మాత్రమే పర్వాలేదనిపించారు.
Mr. Dependable! 🫡
An invaluable FIFTY from @cheteshwar1 here in Indore.
His 35th in Test cricket.
Live - https://t.co/t0IGbs2qyj #INDvAUS @mastercardindia pic.twitter.com/e8ElkPcMCJ
— BCCI (@BCCI) March 2, 2023
- లియాన్‌కు ఎనిమిది వికెట్లు...

పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో నాథన్ లియాన్ చెలరేగిపోయాడు. ఎనిమిది వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ (16)ను ఎల్బీగా ఔట్ చేసి ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. భారత్‌పై అతను ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది తొమ్మిదోసారి. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసి దీటుగా బదులివ్వాలని టీమిండియా అనుకుంది. మొత్తమ్మీద 23.3ఓవర్లు వేసిన లియాన్ 64పరుగులు మాత్రమే ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. లియాన్ బౌలింగ్‌లో ఎక్కువ సార్లు ఔటైన భారత బ్యాటర్‌గా పుజారా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు 13 సార్లు పుజారా అతని బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
స్కోర్‌బోర్డు...
భారత్ తొలి ఇన్నింగ్స్: 109పరుగుల
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 196పరుగులు
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్‌బి)లియాన్ 12, శుభ్‌మన్ (బి)లియాన్ 5, పుజారా (సి)స్మిత్ (బి)లియాన్ 59, కోహ్లి (ఎల్‌బి)కుహ్నెమన్ 13, జడేజా (ఎల్‌బి)లియాన్ 7, శ్రేయస్ (సి)ఖవాజా (బి)స్టార్క్ 26, శ్రీకర్ భరత్ (బి)లియాన్ 3, అశ్విన్ (ఎల్‌బి)లియాన్ 16, అక్షర్ పటేల్ (నాటౌట్) 15, ఉమేశ్ (సి)గ్రీన్ (బి)లియాన్ 0, సిరాజ్ (బి)లియాన్ 0, అదనం 7. (60.3ఓవర్లలో ఆలౌట్) 163పరుగులు.
వికెట్ల పతనం: 1/15, 2/32, 3/54, 4/78, 5/113, 6/118, 7/140, 8/155, 9/155, 10/163
బౌలింగ్: స్టార్క్ 7-1-14-1, కుహ్నెమన్ 16-2-60-1, లియాన్ 23.3-1-64-8, మర్ఫీ 14-6-18-0











