Feb 22,2023 14:39

ప్రజాశక్తి-కురబలకోట : తహసీల్దార్ మొరుసుకాపురెడ్డి సంఘం(వక్కలిగర) తరుపున బుధవారం కురబలకోట మండల తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చినటువంటి 33 జీవో ప్రకారం కురబలకోట మండలం లో ఉండే మొరుసుకాపురెడ్డి కుటుంబాల వారికి బీసీ-బి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని కోరారు. జీవో అమలులోకి వచ్చి నాలుగు సంవత్సరాల అవుతున్నా కూడా ఇoతవరకు బీసీ బి సర్టిఫికెట్స్ ఇవ్యకపోవడo దారుణమన్నారు. మండలంలో ఉండే ప్రతి మొరుసుకాపు కుటుంభం లోన విద్యా పరంగా, ప్రభుత్వ పథకాలు పరంగా ఎన్నో కోల్పోయామని తహసీల్దార్ కి విజ్ఞప్తి చేసారు. సందర్బంగా తహసీల్దార్ స్పందిస్తూ జీవో 33 ప్రకారం మీకు అర్హత ఉంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి 33 జీవో ప్రకారం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల వీఆర్వోలకు సర్కులర్ జారీ చేసి అక్కడ మీ సామాజిక వర్గం వారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అని సమగ్రమైన సమాచారం తెప్పించుకుని ఉన్నతాధికారుల సూచనలతో బిసిబి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొరుసు కాపు రెడ్డి( ఒక్కలిగర) సంఘం ప్రతినిధులు ముట్ర దామోదర్ రెడ్డి, మార్కీరి. ఆంజనేయ రెడ్డి, బైసాని హరినాథ్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి, తరుగు శివారెడ్డి,ఒడిగెల ప్రతాపరెడ్డి, సూరపు శంకర్ రెడ్డి, సర్పంచులు కోళ్ల వాసుదేవరెడ్డి, సోమిరెడ్డి, ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, గౌని వారి వెంకటేశ్వర్ రెడ్డి, తూపల్లి వేణు రెడ్డి, వనిమిరెడ్డి రెడ్డి, శేఖర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, మీసేవ రవీందర్ రెడ్డి, ఎర్రబెల్లి వేణు రెడ్డి ,సదానంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.