Dec 15,2022 21:09

వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న కలెక్టర్‌ గిరీష, జెసి తమీమ్‌ అన్సారియా


 రాయచోటి :రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె. ఎస్‌ .జవహర్‌ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశి ంచారు. గురువారం వెలగపూడి సచిy ాలయం నుంచిహొ ఆయన జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాల పురోగతి, రీ సర్వే, స్పందన గ్రీవెన్స్‌, విఎస్‌ డబ్ల్యూ ఎస్‌ సర్వీసెస్‌, అనీమి యా, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి కలెక్టర్‌ గిరీష పిఎస్‌, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మాట్లాడుతూ స్పందన అర్జీలు బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎలోకి వెళ్ల కుండా గడువులోగా పరిష్కరించాలన్నారు. అర్జీదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికా రులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, బాధితులు సంతప్తిచెందేలా పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలించిన ఫొటోలను కూడా స్పందన పోర్టల్లో అప్లోడ్‌ చేయాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి అయ్యేందుకు ఒక్కో లబ్ధిదారునికి రూ.35 వేలు రుణం ఇప్పించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తేనే పురోగతి ఉంటుందని అధికారులు తమ స్థాయిలో సమీక్ష నిర్వహించి ఇళ్ల నిర్మాణాలలో పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.హొ ఇంకా ప్రారంభం కాని ఇళ్లను వెంటనే ప్రారంభించాలన్నారు. జగనన్న లేఔట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని చెప్పారు. ముఖ్యంగా ప్రతి లే-అవుట్‌ లో విద్యుత్‌, ఇంటింటికీ తాగునీరు వసతి వంటి అన్ని మౌలిక వసతులు కల్పిం చాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద మంజూరైన ఇళ్లన్నీ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నిర్మాణాలు ఇంకా ప్రారం భం కానివి ఉంటె వెంటనే ప్రారంభి ంచాలన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా రీ సర్వే కార్యక్ర మాన్ని వేగవంతం చేయాలన్నారు. గర్భిణులకు, బాలింతలకు, కౌమార దశ అమ్మా యిలకు అనీమియా నివారణకు పౌష్టికా హారం, జగనన్న గోరు ముద్ద, ఐరన్‌ మాత్రలు అందేలా చూడాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల డ్రాపౌట్‌ సంఖ్య తగ్గించేందుకు బడి మానేసిన పిల్లలను బడిలో చేర్పించే దిశగా విద్యాశాఖ అధికారులు, సచివాలయ ఎడ్యుకేషన్‌ ఎమినిటి సెక్రటరీలు, వాలంటీర్లు పర్యవేక్షించాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ గిరీష పిఎస్‌ మాట్లాడుతూ. జగనన్న హౌసింగ్‌ లేఔట్లలో నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు అందరూ ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి లేఅవుటోనూ విద్యుత్‌, నీరు తప్పక ఉండేటట్లు చూడా లన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ఇళ్ల నిర్మాణాలపై దష్టి పెట్టాలన్నారు. ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరికీ రూ. 35 వేల రూపాయల రుణం మంజూరు చేయించాలని అధికారులకు తెలిపారు. రీ సర్వేకు సంబం ధించి అవసరమైన సర్వేయర్లు, సిబ్బంది ఉన్నారని ఇకనుంచి ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. అనీమియా బాధితులు ప్రభుత్వం అందించే పౌష్టి కాహారాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకునే విధంగా ఐసిడిఎస్‌ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో విఆర్‌ఒ సత్యనారాయణ, డిపిఒ ధనలక్ష్మి, హౌసింగ్‌ పీడీ శివయ్య, డిఆర్‌డిఎ సత్య నారాయణ, భూముల సర్వే విభాగం సహాయ సంచాలకులు జయరాజ్‌ పాల్గొన్నారు.