న్యూఢిల్లీ: ఇప్పటివరకు స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న కోవిడ్ రోగులకు వినియోగిస్తున్న ఫావిపిరవిర్ యాంటీ వైరల్ ఔషధం ఇంజెక్షన్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా కోవిడ్ 14 రోజుల చికిత్సలో భాగంగా 122 ఫావిపిరవిర్ 200 ఎంజీ టాబ్లెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని టాబ్లెట్లను మింగడమంటే రోగికి సమస్యగా మారుతోంది. అందుకే సౌకర్యవంతంగా ఉండేలా హెటిరో సంస్థ టాబ్లెట్ల కోర్సులో వాడే డోస్‌నే.. ఇప్పుడు ఇంజక్షన్ల రూపంలో అందుబాటులోకి తెస్తోంది. దీని వినియోగానికి అవసరమైన రెగ్యులేటరీ అనుమతులు కూడా వచ్చాయి. ఇంజెక్షన్ల రూపంలో పేషెంట్లకు మెరుగైన చికిత్సకు ఉపయోగపడుతుందని హైదరాబాద్ డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వై. నవీన్ కుమార్ ఆంగ్ల పత్రిక ఎకనామిక్ టైమ్స్‌కు తెలిపారు. ఇప్పటికే భారత్‌లో ఫావిపిరవిర్ టాబ్లెట్స్ కోవిడ్ చికిత్సలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఔషధంగా నిలిచిన సంగతి తెలిసిందే.










