ప్రజాశక్తి-వేపాడ : పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడిని ఖండించాలని శనివారం మండలంలోని బొద్దాంలో సిపిఎం నాయకులు చల్లా జగన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అమెరికా అండతో ఇజ్రాయిల్.. గాజా ప్రాంతాన్ని సర్వ నాశనం చేస్తోందని జగన్ ఆందోళన వ్యక్తంచేశారు. దాడుల్లో పేదలు, మహిళలు, చిన్నారులు బలవుతున్నారని వాపోయారు. మారణకాండకు కారణమైన ఇజ్రాయిల్ దురహంకారాన్ని ప్రజానీకమంతా ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. వెంటనే ఇజ్రాయిల్ దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు చలుమూరి శ్యామ్, ముస్లిం పెద్దలు అబ్దుల్లా, బుడా, తదితరులు పాల్గొన్నారు.