Nov 15,2023 20:55

నెల్లిమర్ల: మాట్లాడుతున్న ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌

ప్రజాశక్తి - నెల్లిమర్ల : మండలంలోని ఒమ్మి గ్రామంలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గ్రామంలో పర్యటించి సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని గతంలో ఏ ప్రభుత్వాలు చేయని సంక్షేమ పథకాలు, అభివృధి చేసి చూపించారని కొనియాడారు. కాబట్టి మరోసారి వైసిపికి మద్దతు పలికి మరింత అభవృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అంబళ్ల సుధారాణి, జడ్‌పిటిసి గదల సన్యాసినాయుడు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములు నాయుడు, వైసిపి మండల అధ్యక్షులు చనుమల్లు వెంకట రమణ, వైస్‌ ఎంపిపిలు సారికి వైకుంఠం నాయుడు, పతివాడ సత్యనారాయణ, రాష్ట్ర టూరిజం డైరెక్టర్‌ రేగాన శ్రీనివాసరావు, ఇఒపిఆర్‌డి కె. సింహాద్రి, తహసీల్దార్‌ పి.ధర్మరాజు, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
బాడంగి: ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువచేయడంతో పాటు, ప్రభుత్వ పాలనను ప్రజల ఇంటిముందుకే తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బుధవారం మండలంలోని పిన్నవలస గ్రామంలో నిర్మించిన గ్రామ సచివాలయ, కోడూరు-2 సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో మాదిరిగా మండల కేంద్రాలకు తిరిగే పనిలేకుండా తమ గ్రామంలోనే ప్రభుత్వం అందించే అనేక రకాల సేవలు వినియోగించుకునేలా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ రూపొందించిందన్నారు. అనంతరం కోడూరు పంచాయతీ రామచంద్రపురం గడప గడప కార్యక్రమం నిర్వహించరు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు శంబంగి వేణుగోపాల్‌ నాయుడు, జెడ్‌పిటిసి పెద్దింటి రామారావు, సర్పంచ్‌ జ్యోతి, డిఇ అప్పారావు, నాయకులు, రెడ్డి కృష్ణ, మరిపి శంకర్‌ రావు, తెంటు మధు సూదన్‌, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

హెల్త్‌ క్లినిక్‌ భవనాలు ప్రారంభం
బొబ్బిలిరూరల్‌ : మండలంలోని యం.బూర్జవలస, నారాయణప్ప వలస గ్రామాలలో నూతనంగా నిర్మించిన వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలను ఎమ్మెల్యే అప్పలనాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శంబంగి లక్ష్మీ, వేణుగోపాలనాయుడు, జెడ్‌పిటిసి సంకిలి శాంతకుమారి, ఎంపిటిసిలు గుణుపురు దేవి, గొర్లి తిరుపతి, సర్పంచ్‌ జాగరపు శ్రీనివాసరావు, పాల్గొన్నారు.
భోగాపురం: మండలంలోని పోలిపల్లిలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బుధవారం అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌కి జగన్‌ ఎందుకు కావాలి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన చెత్త సంపద కేంద్రం ప్రహరీ గోడ, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. సచివాలయంలో వివిధ పథకాలకు సంబంధించిన డిస్‌ ప్లే బోర్డును ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, ఎంపిడిఒ అప్పలనాయుడు, సర్పంచ్‌ కర్రోతు వెంకటరమణ, సచివాలయ కన్వీనర్‌ పతివాడ రామకృష్ణ, నాయకులు కర్రోతు శ్రీనివాసరావు, బంగార్రాజు, పాల్గొన్నారు. వేపాడ: మండలంలోని రామస్వామి పేట గ్రామంలో జగనన్న సంక్షేమ పథకాలు డిజిటల్‌ బోర్డును ఎంపిపి డి. సత్యవంతుడు ఆవిష్కరించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. సర్పంచ్‌ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు, వైసిపి మండల అధ్యక్షులు జగ్గుబాబు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎన్‌ వెంకట్రావు, నాయకులు దుల్ల మహేష్‌, సోంపురం సర్పంచ్‌ గంగరాజు, పంచాయతీ విస్తరణ అధికారి ఉమా పాల్గొన్నారు.