Mar 03,2023 15:51

ప్రజాశక్తి - బి.కొత్తకోట : సమిష్టి కృషితో ఆసుపత్రిని అన్నివిధాలా అభివృద్ధి చేసుకుందామని బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రి అభివృధ్ధి కమిటీ తీర్మానించింది. శుక్రవారం కమిటీ సభ్యులు కంచి కళ్యాణ్ కుమార్ రెడ్డి, నక్కా మహేష్ కుమార్, వైద్యులు సర్జన్ కిరణ్, హసీనా,తదితర వైద్యులు, వైద్యసిబ్బంది మరియు వైద్యేతర సిబ్బంది ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ బి.కొత్తకోట ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని, నుాతనంగా చిన్న పిల్లల వైద్యురాలిని నియమించారని తెలియచేశారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి సహకారంతో ఆసుపత్రిని మరింత అభివృద్ధిని చేస్తామన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించడం శుభపరిణామమన్నారు. ఆసుపత్రికి మహర్దశ తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు.