Feb 23,2023 15:59
  • టీబి యూనిట్ అధికారిని డాక్టర్ సృజన

ప్రజాశక్తి-నందలూరు : పేద క్షయ రోగులను దత్తత తీసుకోవాలి నందలూరు,టీ బి యూనిట్ అధికారిని డాక్టర్ సృజన కోరారు. ఈ సందర్భంగా గురువారం ఆమె మాట్లాడుతూ ప్రధాన మంత్రి టీ బి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా మండల వ్యాప్తంగా చికిత్స లో ఉన్న క్షయ రోగులకు నెల నెల వారికి కావలసిన పౌష్టిక ఆహారం అందించడానికి దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి క్షయ రోగులను దత్తత తీసుకోవాలని అన్నారు. నందలూరు టీ బి యూనిట్ పరిధిలోని నందలూరు, రాజంపేట మరియు పెనగలూరు మండలాల పరిధిలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న 150 మంది రోగులకుగాను 18 మందిని మాత్రమే దత్తత తీసుకోవడం జరిగిందని ఇంకా చాలా మంది పేద క్షయ రోగులకు ప్రభుత్వం ఉచిత మందులు మరియు నెలకు 500 రూపాయలు సహాయo అందిస్తున్నామని, ప్రస్తుతం నెలకు సరిపడా పౌష్టిక ఆహారం దాతలు సహకరిస్తే రోగులకు మెరుగైన వైద్యం తో పాటు త్వరగా కోలుకోవడానికి సహకరించిన వారవుతారని అన్నారు.7 ఈ కార్యక్రమంలో నందలూరు మండల వైద్యాధికారి డాక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి, ఉమ్మడి కడప జిల్లా క్షయ చికిత్స సమన్వయకర్త నాగేంద్ర, నందలూరు టీ బి యూనిట్ సూపర్వైజర్  జయ ప్రకాష్, నందలూరు ఎం ల్ హెచ్ పి ఆరిఫ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.