పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేత : అధ్యక్షుడు మల్లు సుబ్బనరసారెడ్డి
ప్రజాశక్తి - పుల్లంపేట : మండల కేంద్రంలోని SBVD సభా కళాశాల నందు ఇంటర్మీడియట్ మొదట సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హర్షవర్ధిని కాలేజీ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న విషయము పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘ అధ్యక్షుడు మల్లు సుబ్బనరసారెడ్డికి తెలియగానే AP టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ వత్తలూరు సాయికిషోర్ రెడ్డి దృష్టికి తీసుకువెల్లడం జరిగింది. వెంటనే స్పందించిన సాయికిషోర్ రెడ్డి తక్షణమే ఆవిద్యార్థిని కళశాలకు చెల్లించవలసిన మొత్తాన్ని సంఘ అధ్యక్షుడు సుబ్బనరసారెడ్డికి అందించడం జరిగింది. ఆమొత్తాన్ని సంఘ అధ్యక్షుడు మల్లు సుబ్బనరసారెడ్డి చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపల్ అద్దేపల్లి బాలాజీ రాజు గారికి అందించడం జరిగింది . ఈసందర్భముగా అధ్యక్షుడు సుబ్బనరసారెడ్డి మాట్లాడుతూ సాయికిషోర్ రెడ్డిని అడిగిన వెంటనే విద్యార్థినికి చెల్లించవలసిన మొత్తాన్ని సంగం వారికి చెల్లించడం జరిగింది. పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘము ద్వారా చేసే సేవాకార్యక్రమాలు అభినందనీయమని మీరు భవిష్యత్తులో చేసే సేవా కార్యక్రమాలకు నాయొక్క సహాయసహకారములు అందించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది . కిషోర్ రెడ్డికి మా సంఘం సభ్యులందరి తరపున మరియు విద్యార్థిని కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియబరుస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు మల్లు సుబ్బనరసారెడ్డి తెలియజేయడం జరిగింది . ఈకార్యక్రమము నందు సంఘ ఉపాధ్యక్షుడు వాహిద్, కోశాధికారి నరసింహులు,వాలంటీర్ మురళీ,అమీర్ తదితరులు పాల్గొన్నారు.










