ప్రజాశక్తి- కలకడ: కుష్టు వ్యాధి గ్రస్తులకు వైద్య సేవలు అందించినట్లు వైద్యాధికారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు.శుక్రవారం మండలంలోని ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కుష్టి వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందిస్తూ మాట్లాడుతూ ఎర్రకోట పల్లి పంచాయతీ నంబూరు వారి పల్లి లెప్రసీ వ్యాధి గ్రస్తులు అంగ వవైకల్యం ఉన్నవారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స సదుపాయాలను కల్పించడం జరిగినది .కాళ్ళు చేతులు ఒక బకెట్లో పెట్టి బాగా నానిన తర్వాత గరుకు రాయి తో శుభ్రం చేయుట వలన వారి చర్మం మృదువుగా ఏర్పడుతుందని,అలాగే ఆయిలింగ్ కూడా చేసుకో వచ్చునని తెలిపారు ,ఇలా రోజు మార్చి రోజు చేసుకున్నట్టు వలన వారికి పుండ్లు ,గాయాలు కాకుండా ఉంటుంది.వారికి కావలసిన కట్టు గుడ్డ బ్యాండేజీ క్లాత్ .కావలసిన మందులుఇచ్చి పంపడం జరిగినది.ఈ కార్యక్రమంలో జి. జయరామయ్య ఎం.పీ.హెచ్. ఈ. సుబ్బరత్నా పి.హెచ్. న్ సూపర్వైజర్లు .ముజీబ్ భాష. బి. రెడ్డమ్మ.స్టాఫ్ నర్స్ భారతమ్మ ఆరోగ్య కార్యకర్త ఎన్ .వాణి ఆశా కార్యకర్తలు గురు శాంత .అలివేలుమంగ బాయ్.పాల్గొన్నారు.










