సమస్యను సిఎంకు విన్నవిస్తున్న ఎమ్మెల్యే
కదిరి అర్బన్ : సిఎం జిల్లాపర్యటన నేప్యంలో కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తమ నియోజకవర్గంలోని సమస్యలపై సిఎంకు విన్నవించారు. గాండ్లపెంట మండలానికి హంద్రీనీవా నీటిని విడుదల చేసే విషయంపై వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో అన్ని చెరువులకు నీటిని అందజేస్తున్నామని కేవలం ఒక గాండ్లపెంట మండలానికి హంద్రీనీవా నీటిని ఇవ్వలేకపోతున్నామని వివరించారు. నీటి కేటాయింపునకు సంబంధించిన పనులు త్వరగా చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయానికి సంబందించిన ఫైల్ ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్‌లో ఉందని సిఎం దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు.










