Nov 10,2023 20:38

కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  మున్సిపల్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్సు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కార్యాలయానికి వస్తున్న అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రసాదరావును అడ్డుకున్నారు. 3 నెలల హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ. జగన్మోహన్‌ రావు మాట్లాడుతూ 2021లో జనవరి, 2022లో సెప్టెంబర్‌, 2023 లో అక్టోబర్‌ నెల హెల్త్‌ అలవెన్సులు బకాయిలు ఉన్నాయని, గత కొంతకాలంగా ఇవ్వాలని అడుగుతుంటే అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని టెక్నికల్‌ సమస్య ఇక్కడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. తక్షణమే హెల్త్‌ అలవెన్సే చెల్లించాలని లేని, లేనియెడల ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు పైడిరాజు,రామారావు, సూరి,వంశీ, గౌరీ తదితరులు పాల్గొన్నారు.