ప్రజాశక్తి-పీలేరు : పీలేరు మండలం, గూడరేవుపల్లి పంచాయితీ పరిధిలో కబ్జాకు గురైన 53 సెంట్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు మండల తహశీల్దార్ జి. రవి తెలిపారు. జిల్లా కలెక్టరుకు అందిన ఫిర్యాదుల మేరకు, కలెక్టర్ తమకిచ్చిన ఆదేశానుసారం స్థానిక తిరుపతి రోడ్డులో సర్వేనెంబర్ 200/3లో 53 సెంట్ల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా కబ్జా చేసి, అందులో మట్టితోలి చదును చేస్తుండగా శుక్రవారం తమ సిబ్బంది అక్కడికి చేరుకుని, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని, అది ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజశేఖర్, గూడరేవుపల్లి విఆర్ఓ రెడ్డి రాణి, వీఆర్ఏలు ఆది, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.










