Dec 30,2022 15:45

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ :  అందరికీ విద్య ఉపాధి సాధనకై ఉద్యమించాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ 53వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఐ టి ఐ కలాశాల ఎదుట జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి మాట్లాడుతూ 1970లో కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో డిసెంబర్ 29 నుంచి 31వ తేదీలలో అధ్యయనం, పోరాటం, నినాదంతో స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం ఆశయ సాధన కొరకు ఉద్యమించడం జరుగుతోందని తెలిపారు. అందరికీ ప్రభుత్వమే ఉచిత విద్య అందించాలని, చదువుకున్న ప్రతి ఒకరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ తో నాటి నుంచి నేటి వరకు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహిస్తుందని తెలియజేశారు. విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ కు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వ విద్య పరిరక్షణకై దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, పట్టణ అదక్ష్య , కార్యదర్శిలు రజాక్, వెంకటేష్ , ఎస్.ఎఫ్. ఐ నాయకులు కార్తీక్, మనోహర్, లోకేష్, అమర్, నవీన్, బాలాజీ, అఖిల్, శ్రీనివాసులు, రోహిత్, విద్యార్థులు పాల్గొన్నారు.