Jan 12,2023 13:22

ప్రజాశక్తి - బి.కొత్తకోట : బి.కొత్తకోట పట్టణానికి చెందిన బైపాస్ రోడ్డు యువకులు యంగ్ ఇండియా సేవా సమితి సభ్యులు ఆధ్వర్యంలో చాంద్ బాషాలు, జనార్ధన్, మౌలా, రెడ్డి,బిస్కెట్ ఫిరోజ్, నిరుపేదల ఆకలి తీర్చారు.వివరాల్లోకి వెళితే బి.కొత్తకోట పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన సి.ఆనంద్ ఇంటిలో జరిగిన శుభకార్యం కార్యక్రమంలో చాలా వరకు భోజనం మిగిలిపోవడంతో ఈ విషయాన్ని స్థానిక ప్రజాశక్తి విలేకరికి తెలియజేశారు. దీంతో అందుబాటులో ఉన్న బైపాస్ రోడ్డు యువకులు యంగ్ ఇండియా సేవ సమితి సభ్యులు కలిసి ఆలేటిపల్లికి వెళ్లే దారిలో గుడారాలు నిర్మించుకొని ఉన్న నిరుపేదలకు బుధవారం రాత్రి ఆ ఆహారాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణములో ఏదైనా శుభాకార్యాల్లో ఆహారం మిగిలితే వృధా చేయకుండా మమ్మల్ని సంప్రదిస్తే ఆహారం పేదలకు పంచి పెడతామన్నారు. వివరాలకు 8341897396,9916073322,  అనే మొబైల్ నెంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.